: ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలం: జపాన్ పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు
విజయవాడ లయోలా కళాశాల మైదానంలో మామిడి మేళా -2016ను ప్రారంభించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు జపాన్ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జపాన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు మంచి సత్సంబంధాలున్నాయని అన్నారు. జపాన్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఏపీని అభివృద్ధివైపు పరుగులు పెట్టిస్తామని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నవ్యరాజధాని అమరావతి నుంచి జపాన్ దేశ రాజధాని టోక్యోకు విమాన సేవలు అందుతాయని చెప్పారు. నేడు చైనా, జపాన్ దేశాలలో బౌద్ధమతం వ్యాపించి ఉందని, ఏపీనుంచే బౌద్ధం ఆ ఇరు దేశాల్లోకి వెళ్లిందని ఆయన తెలిపారు. ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను చంద్రబాబు నాయుడు జపాన్ పారిశ్రామిక వేత్తలకు తెలిపారు. ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.