: ట్విట్టర్ వేదికగా దుమ్ము రేపిన స్మృతీ ఇరానీ, ప్రియాంకా చతుర్వేదీ!


రాహుల్ గాంధీని విమర్శిస్తూ, ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు, ఆపై వాటిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది చేసిన ట్వీట్లు, వ్యక్తిగత విమర్శలకు దారితీయగా పెను దుమారమే రేగింది. తనపై నిర్భయ తరహాలో అత్యాచారం చేస్తామని బెదిరింపులు వచ్చినట్టు ప్రియాంక ఓ వ్యాసంలో రాసిన విషయమై మొదలైన చర్చ ఎంతవరకూ వెళ్లిందంటే... ప్రియాంక వ్యాసంపై మండిపడ్డ షెఫాలీ వైద్య, ప్రియాంకపై దాడి జరిగితే అది మహిళలపై దాడి అయినప్పుడు, స్మృతీ ఇరానీపై దాడి జరిగితే అది అలాంటి దాడి అవ్వదా? అంటూ ప్రశ్నించారు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ, జడ్ కేటగిరీ భద్రతలో ఉన్న ఆమెపై ఎలా అత్యాచారం జరుగుతుందని, తనకు ఎలాంటి సెక్యూరిటీ లేదని అన్నారు. ఈ ట్వీట్ల మధ్యకు తన ప్రస్తావన రావడంతో స్మృతీ ఇరానీ చేరి, తనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లేదని స్పష్టం చేయగా, అసలు సెక్యూరిటీ అంటూ లేకుండా ఉండదు కదా? అని ప్రియాంక వ్యాఖ్యానించారు. దీనిపై మళ్లీ స్పందిస్తూ, తన భద్రత గురించి అంత ఆలోచన ఎందుకని, ఏదైనా ప్లాన్ చేయిస్తున్నావా? అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ట్విట్టర్ వేడిని మరింతగా రగిలించగా, తనకంత తీరిక లేదని, మీరు మాత్రం యూనివర్శిటీ క్యాంపస్ లను రచ్చ చేసే పనిలోనే ఉండాలని కాస్త ఘాటుగానే స్పందించారు ప్రియాంక. దీనికి కూడా స్మృతీ బదులిస్తూ, రాహుల్ పై విమర్శలకు దిగారు. అసోంలో ఓటమి ఆయన ఘనతేనని స్మృతీ ట్వీట్ చేయగా, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన మీరు, క్యాబినెట్ హోదాను పొందారుగా అంటూ ప్రియాంక కౌంటరేశారు. వీరిద్దరి మధ్యా ఇలా సాగుతోంది ట్విట్టర్ పోరు. నెటిజన్లు మాత్రం తదుపరి ఎలాంటి ట్వీట్లను చూడాల్సి వస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News