: పది లక్షలు అమ్ముడుపోయిన మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫోన్లు


కాన్వాస్ శ్రేణి మొబైల్ ఫోన్ల విక్రయాలు 10లక్షల సంఖ్యను దాటినట్లు హ్యాండ్ సెట్ల తయారీలో దేశీయ అగ్రగామి కంపెనీ మైక్రోమ్యాక్స్ ప్రకటించింది. వీటికి డిమాండ్ అధికంగా ఉన్నట్లు మైక్రోమ్యాక్స్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సుబోదిప్ పాల్ చెప్పారు. ఒక్క వేలంటైన్స్ డే రోజే 9వేల ఫోన్లను విక్రయించామని తెలిపారు. పలు కారణాల వల్ల ఫోన్ల రవాణాలో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ శ్రేణి లో కొత్తగా 3డి ఎ115 ఫోన్ ను ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల ప్రారంభంలో విడుదల చేయనుందని సమాచారం. ఇందులో 5 అంగుళాల డబ్ల్యువిజిఎ డిస్ ప్లే, డ్యుయల్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, వెనుక 8 మెగాపిక్సెల్, ముందు 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందంటున్నారు.

  • Loading...

More Telugu News