: ఇక హర్యానా మాజీ సీఎం వంతు!... భూపీందర్ సింగ్ హూడాకు సీబీఐ నోటీసులు!


కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రముఖులకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పార్టీ ఫిరాయింపులతో సీఎం పీఠాన్నే వదులుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్న ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్... న్యాయస్థానాల పుణ్యమా అని గట్టెక్కారు. సీఎం పదవిని నిలబెట్టుకున్నా... స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా బుక్కైన ఆయనకు సీబీఐ విచారణ తప్పేలా లేదు. ఇక సుదీర్ఘ కాలం పాటు హర్యానా సీఎంగా కొనసాగి మొన్నటి ఎన్నికల్లో మాజీ సీఎంగా మారిన భూపీందర్ సింగ్ హూడా వంతు వచ్చింది. హర్యానా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (హుడా) అక్రమ భూకేటాయింపులకు సంబంధించిన కేసులో ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. త్వరలోనే ఆయనను సీబీఐ అధికారులు విచారించనున్నారు. 2012లో హూడా సీఎంగా ఉండగా వెలుగుచూసిన ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే 13 మంది అధికారులపై కేసులు నమోదు చేసిన సీబీఐ... విచారణలో భాగంగా హూడా ప్రమేయం ఉందని తేలితే ఆయనపైనా కేసు నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

  • Loading...

More Telugu News