: తంబీల ఈలలు, కేకల మధ్య... తమిళ సీఎంగా ప్రమాణం చేసిన పురచ్చితలైవి
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళ జనం ‘అమ్మ’గా పిలుచుకునే ‘పురచ్చితలైవి’ జె.జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కొద్దిసేపటి క్రితం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. చెన్నైలోని మద్రాస్ వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల మధ్య జయలలిత తన మతృభాష తమిళంలోనే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం చేసేందుకు జయలలిత లేచిన సందర్భంగా, ప్రమాణ స్వీకారం ప్రారంభ సమయంలోనూ జయ అభిమానులు వేసిన ఈలలు, కేకలతో వర్సిటీ ప్రాంగణం దద్దరిల్లిపోయింది.