: కృష్ణానదిపై నిర్మిస్తోన్న తెలంగాణ ప్రాజెక్టులు ఆపేయాల్సిందే.. విజయవాడలో ధర్నా
ఎటువంటి అనుమతులూ లేకుండా తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆరోపిస్తూ విజయవాడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కొనసాగుతోంది. కృష్ణా నదిపై నిర్మిస్తోన్న ప్రాజెక్టులను నిలిపేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడి ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.