: సారీ చెప్పే సమస్యే లేదు: ఒబామా


ఈ వారంలో జపాన్ లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, గతంలో హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అణుబాంబులు వేసిన విషయమై, ఆ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు. జపాన్ అధికార ప్రసారమాధ్యమ సంస్థ ఎన్.హెచ్.కేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. జపాన్ లో ప్రసంగిస్తున్న వేళ, క్షమాపణ కూడా ఉంటుందా? అని అడుగగా, 'చరిత్రకారులు ఈ తరహా ప్రశ్నలు అడిగి వారిని పరీక్షిస్తుంటారు. యుద్ధ సమయాల్లో నేతలు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుంది. ఈ సంగతి చరిత్రకారులతూ తెలుసు. నేను క్షమాపణలు చెప్పబోను' అని అన్నారు. ఆగస్టు 6, 1945న హిరోషిమాపై, ఆ తర్వాత మూడు రోజులకు నాగసాకిపై అమెరికా అణుబాంబులు వేసిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో 1.40 లక్షల మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన జరిగి 71 సంవత్సరాలు గడుస్తుండగా, అణుబాంబు దాడి తరువాత, జపాన్ దేశాన్ని పదవిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News