: ప్రధాని ఇరాన్ పర్యటన ప్రారంభం... రేపు అధ్యక్షుడితో కీలక భేటీ


ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల ఇరాన్ పర్యటన కోసం ఆదివారం సాయంత్రం టెహ్రాన్ చేరుకున్నారు. మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇరాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రి అలీ తయ్యబ్ నియా ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. గత 15 ఏళ్ల కాలంలో ఇరాన్ లో అడుగుపెట్టిన తొలి భారత ప్రధాని మోదీ కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా చబహార్ పోర్ట్ అభివృద్ధిపై రెండు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. టెహ్రాన్ లో అడుగుపెట్టిన వెంటనే ప్రధాని స్థానికంగా ఉన్న భారత సంతతి వారితో సమావేశమయ్యేందుకు ఓ గురుద్వారాకు వెళ్లారు. సోమవారం ఉదయం ఇరాన్ అధ్యక్షుడు హస్సాన్ రౌహానితో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. అనంతరం మోదీకి రౌహాని విందు ఇస్తారు. ఇరాన్ అత్యున్నత నేత అయోతుల్లా అలీ ఖమేనీని కూడా ప్రధాని కలుసుకోనున్నారు. వీరితో సమావేశం రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అందివచ్చిన అవకాశంగా మోది టెహ్రాన్ నుంచి ట్వీట్ చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భాగస్వామ్యం తదితర అంశాలు తమ ప్రాధాన్యాలుగా పేర్కొన్నారు. ప్రధాని వెంట మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News