: కరవు నివారణలో ఏపీ భేష్.. ప్రధాని మోదీ ప్రశంస
కరవు నివారణ చర్యలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు సాంకేతికతను బాగా వినియోగించుకున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’లో ప్రశంసించారు. దేశవ్యాప్తంగా తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయని, నీటిని ఏ మాత్రం కూడా వృథా చేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కరవు నివారణ చర్యలో చాలా రాష్ట్రాలు మెరుగ్గా వ్యవహరించాయని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ల చర్యలు బాగున్నాయని పేర్కొన్నారు.