: వెండితెరకు పరిచయం కానున్న హాస్యనటుడు గౌతంరాజు కుమారుడు
ప్రముఖ హాస్య నటుడు గౌతంరాజు తన కుమారుడు కృష్ణను వెండి తెరకు పరిచయం చేయనున్నాడు. తన తనయుడిని హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చిత్ర రంగానికి పరిచయం చేయనున్నట్లు సమాచారం. కృష్ణ ఏ చిత్రం ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రంగ ప్రవేశం చేస్తాడు, చిత్రం షూటింగ్ మొదలైన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, సుమారు ముప్ఫై ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న గౌతంరాజు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.