: మార్కుల విషయంలో పిల్లలపై పెద్దలు ఒత్తిడి తేవద్దు: ‘మన్ కీ బాత్’ లో ప్రధాని మోదీ
మార్కుల విషయంలో పెద్దలు పిల్లలపై ఒత్తిడి తీసుకురాకుండా... వారిని ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 20వ ఎడిషన్ లో ఈరోజు ఆయన ప్రసంగించారు. ఇటీవల వెలువడిన పరీక్షా ఫలితాల్లో పాసైన విద్యార్థులను మోదీ అభినందించారు. బాలికలు అత్యుత్తమ ఫలితాలను సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. జలసంరక్షణపై కూడా ఆయన మాట్లాడారు. నీరు దేవుడిచ్చిన అపురూపమైన కానుకని, ఒక్క నీటి చుక్కను కూడా వృథా చేయవద్దని సూచించారు. కరవు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో తాను ఇటీవల సమావేశమైనానని, కరవు నివారణకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు.