: ఈ రెండు కులాలు కలిస్తే ఏపీలో ఏదైనా జరగొచ్చు: ముద్రగడ పద్మనాభం
ఏపీలో కాపులు, దళితులు కలిస్తే ఏదైనా జరగొచ్చని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ ను ఆయన ఈరోజు కలిశారు. అనంతరం మీడియాతో ముద్రగడ మాట్లాడుతూ, కాపు ఉద్యమానికి సహకరించిన హర్షకుమార్ కు కృతఙ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఏపీలో కాపులను, దళితులను అణచివేసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం ఇచ్చిన గడువు ఆగస్టుతో ముగుస్తుందని, ఆ తర్వాత తమ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.