: హైదరాబాద్ లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న వైద్యుడు అరెస్ట్


హైదరాబాద్ అమీర్ పేటలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న కార్డియాలజిస్ట్, డాక్టరు గులే వైభవ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో వారు రంగంలోకి దిగారు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను సబ్ ఇన్ స్పెక్టర్ జగన్ తెలిపారు. శ్యామ్ లాల్ బిల్డింగ్ సమీపంలోని ఒక గెస్ట్ హౌస్ వద్ద ఉన్న ఇంట్లో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు శుక్రవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. ఒక మహిళతో పాటు డాక్టరు వైభవ్ కుమార్, విశాల్ రాజ్ బురే, మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన వైభవ్ కుమార్ ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్నాడు. మరో నిందితుడు విశాల్.. బోయినపల్లి సమీపంలో నివసిస్తున్నాడు. వైభవ్ కుమార్ రెండు నెలలుగా వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, విటులకు తన ఫోన్ నంబరు ఇచ్చి గెస్ట్ హౌస్ కు రప్పిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులను అరెస్టు చేసి నిన్న రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ జగన్ తెలిపారు.

  • Loading...

More Telugu News