: సూర్యాపేటలో వ్యాపారి దారుణ హత్య!
నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో ఒక వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, మృతుడిని వ్యాపారి వెంకటాచారిగా గుర్తించామన్నారు. అయితే, ఈ సంఘటనకు సంబంధించిన మృతుడి భార్యపై అనుమానాలు తలెత్తడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.