: కుంభమేళాలో వెల్లివిరిసిన సామరస్యం...మసీదులో వసతి ఏర్పాటు


మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయినిలో జరుగుతున్న సింహస్థ కుంభమేళాలో మతసామరస్యం వెల్లివిరిసింది. ముస్లింలు హిందూ భక్తుల కోసం ఏకంగా మసీదులో వసతి ఏర్పాటు చేయడంపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సింహస్థ కుంభమేళా ప్రారంభమైన తరువాత ఈనెల ఆరంభంలో వర్షాలు పడి భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు కూలిన సంగతి తెలిసిందే. అప్పుడు ఎక్కడ ఉండాలో తెలియక చాలా మంది అవస్థలు పడ్డారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న భక్తులను ఆదుకునేందుకు అక్కడి ముస్లింలు స్వచ్ఛందంగా ముందుకు కదిలారు. భక్తులు తలదాచుకునేందుకు చోటు కల్పించారు. కుంభమేళాలో పాల్గొనేందుకు వచ్చిన హిందూ భక్తులకు మసీదులో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేశారు. ఇబ్బంది పడుతున్న భక్తులను అక్కడికి తరలించి, దైవత్వం అంటే పూజలే కాదని, మానవత్వం కూడా దైవత్వమేనని నిరూపించారు.

  • Loading...

More Telugu News