: నాకు పెళ్లి కాలేదు...పెళ్లి కోసం తహతహలాడడం లేదు: సల్మాన్ ప్రేయసి


తాను వివాహం చేసుకుంటున్నానంటూ ఇటీవల జాతీయ మీడియాలో కథనాలు వెలువడడంపై నిన్న సల్మాన్ ఖాన్ మీడియాపై మండిపడగా, తాజాగా ఆయన ప్రేయసి రొమేనియన్ మోడల్ లులియా వంతూర్ కూడా స్పందించింది. ఈ మేరకు ఇన్ స్టా గ్రాంలో ఓ పోస్టు పెట్టింది. 'ప్రియమైన మిత్రులారా! నా వివాహంపై వస్తున్న వదంతులపై స్పందించాల్సిన అవసరం లేదని ఇప్పటివరకు భావించాను. అయితే ఈ వదంతులకు అడ్డుకట్ట పడకపోవడంతో స్పందిస్తున్నాను. భారతీయ మీడియా చెబుతున్నట్టు గతంలో ఎప్పుడూ నాకు పెళ్లి కాలేదు. అదే సమయంలో పెళ్లి చేసుకోవడానికి నేను తహతహలాడడం లేదు' అని స్పష్టం చేసింది. లూలియ-సల్మాన్ ల వివాహం డిసెంబర్‌ లో సల్మాన్ పుట్టిన రోజున జరగనుందని, ఈమేరకు సల్మాన్ కుటుంబం ఏర్పాట్లు కూడా చేసుకుంటోందంటూ కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News