: కామెంట్రీ బాక్స్ లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఇషా గుహ
కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. ఐపీఎల్ సీజన్ 8 లో పార్ట్ టైమ్ కామెంటేటర్ గా వ్యవహరించిన ఇషా గుహ, సీజన్ 9లో పూర్తి స్థాయి కామెంటేటర్ గా వ్యవహరిస్తోంది. తన వ్యాఖ్యానంతో ఆకట్టుకున్న ఇషా గుహకు కామెంట్రీ సహచరులు సునీల్ గవాస్కర్, ఇయాన్ బిషప్ తదితరులు సర్ ప్రైజ్ చేశారు. ఈ రోజు ఇషా గుహ పుట్టిన రోజును పురస్కరించుకుని కామెంట్రీ బాక్స్ లో కామెంట్రీ చెబుతుండగా ఆమె చేత కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆమెకు విషెస్ చెబుతూ దిగ్గజ ఆటగాళ్లు చిన్నపిల్లల్లా మారిపోయారు. దిగ్గజాలు ఇలా తన పుట్టిన రోజు వేడుకలు జరపడంపై ఇషా ఆనందం వ్యక్తం చేసింది. దీనిని ఎలా వ్యక్తీకరించాలో తనకు తెలియడం లేదని చెబుతూ ధన్యవాదాలు చెప్పింది.