: కేన్సర్ తో బాధపడుతోన్న అభిమానిని కలసిన అమితాబ్!
కేన్సర్‌తో బాధపడుతోన్న తన అభిమాని కోరికను బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తీర్చారు. కేన్సర్‌తో బాధపడుతోన్న యువతి హార్ధికకి తన పుట్టినరోజు వేడుకను అమితాబ్ ముందు కేక్ కట్ చేసి జరుపుకోవాలని ఆశ ఉండేది. ఈ విషయాన్ని తెలుసుకున్న అమితాబ్ తన అభిమాని ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించి, తన అభిమాని నోరు తీపి చేసి వచ్చారు. ఈ విషయాన్ని బిగ్ బీ తన బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. హార్ధిక అనే అమ్మాయి కేన్సర్‌తో బాధపడుతోందని, ఆమెకు తనను కలవాలనే కోరిక ఉండేదని ఆయన పేర్కొన్నారు. హార్ధిక త్వరలోనే కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హర్ధికకు అమితాబ్ బచ్చన్ పుష్పగుచ్చాన్నిచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.