: ఏపీకి సాయం అందలేదన్నది పచ్చి అబద్దం: రామ్ మాధవ్
ఏపీకి సాయం అందలేదన్నది పచ్చి అబద్ధమని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఏపీ ప్రజల్లో ప్రత్యేకహోదా సెంటిమెంట్ బలంగా ఉందని అన్నారు. ప్రత్యేకహోదాపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి పాటుపడతామని ఆయన చెప్పారు. రెండు సీట్ల స్థాయి నుంచి అధికారం చేపట్టే స్థాయికి అసోంలో చేరామని ఆయన తెలిపారు. ఏపీలో కూడా అదే స్థాయికి చేరుకుంటామని ఆయన పేర్కొన్నారు. తూర్పు తీర ప్రాంతంలో పార్టీని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు.