: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ - మెడిసిన్ లో తెలంగాణ విద్యార్థుల హవా
కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విడుదల చేసిన ఏపీ ఎంసెట్ మెడిసిన్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. తొలి పది ర్యాంకుల్లో ఆరుగురు తెలంగాణ విద్యార్థులకు స్థానం లభించింది. రెండవ ర్యాంకు సాధించిన యర్ల సాత్విక్ రెడ్డి (155 మార్కులు)ది రంగారెడ్డి జిల్లా కాగా, 3వ స్థానంలో నిలిచిన అమ్మకుల యజ్ఞప్రియ (153 మార్కులు), ఇక్రమ్ ఖాన్ (152 మార్కులు), సాహితి (153 మార్కులు) హైదరాబాద్ వారు. 8వ ర్యాంకు సాధించిన బలభద్ర గ్రీష్మ మీనన్ (150 మార్కులు) వరంగల్ జిల్లాకు, 9వ ర్యాంకు సాధించిన శివకుమార్ (150 మార్కులు) నల్గొండ జిల్లాకు చెందిన వారు. తొలి 1000 ర్యాంకులు సాధించిన వారిలో సైతం తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు అత్యధికులు ఉన్నట్టు తెలుస్తోంది.