: బెస్ట్ కీపర్ ధోనీ కాదు... దినేష్ కార్తీక్!


ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యుత్తమ కీపర్ ఎవరు? అన్న ప్రశ్న వస్తే, దానికి మహేంద్ర సింగ్ ధోనీ పేరు కచ్చితంగా వినిపిస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అదే ఐపీఎల్ పోటీలకు వస్తే, ధోనీ కన్నా ముందు నిలిచి తానే బెస్ట్ అనిపించుకుంటున్నాడు దినేష్ కార్తీక్. ప్రస్తుతం గుజరాత్ లయన్స్ కు ఆడుతున్న కార్తీక్, గతంలో బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్, ముంబై జట్లకు కూడా ఆడాడు. ఐపీఎల్ పోటీల్లో మొత్తం 97 మందిని ఔట్ చేయడం ద్వారా దినేష్ ముందు నిలిస్తే, ధోనీ 89 మందిని మాత్రమే ఔట్ చేయగలిగాడు. 71 క్యాచ్ లు, 26 స్టంపింగ్ లతో దినేష్ తాను ధోనీ కన్నా బెస్టనిపించుకోగా, ధోనీ 62 క్యాచ్ లు, 27 స్టంపింగ్ లు చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఈ సీజన్ పరుగుల విషయంలోనూ కార్తీక్, ధోనీని వెనక్కు నెట్టేశాడు. ఇప్పటివరకూ 13 మ్యాచ్ లు ఆడిన ధోనీ 220 పరుగులు చేయగా, కార్తీక్ 280 పరుగులు చేశాడు. ధోనీ ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేకపోగా, కార్తీక్ మూడు హాఫ్ సెంచరీలు చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News