: ప్రధాని మోదీకి యాపిల్ అప్ డేట్... దగ్గరుండి చూపించిన టిమ్ కుక్


నిత్యమూ ప్రజలతో దగ్గరగా ఉండాలని, వారి సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని భావిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తయారు చేయించుకున్న 'నరేంద్ర మోదీ మొబైల్ యాప్'కు సరికొత్త అప్ డేటెడ్ వర్షన్ ను స్వయంగా తయారు చేయించుకుని వచ్చిన యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ దాన్ని స్వయంగా మోదీ సమక్షంలో విడుదల చేసి, తాము చేసిన మార్పును ఆయనకు స్వయంగా పరిచయం చేశారు. ఆపై మోదీ స్పందిస్తూ, టిమ్ కుక్ తనపై చూపిన ఆప్యాయతకు, యాప్ కు చేసిన మంచి అప్ డేట్ కు కృతజ్ఞతలు తెలిపారు. "టిమ్ కుక్ విడుదల చేసిన 'నరేంద్ర మోదీ మొబైల్ యాప్'తో ఎంతో సంతోషం వేసింది. థ్యాంక్యూ మిస్టర్ కుక్. ఈ సరికొత్త వర్షన్ లో 'మై నెట్ వర్క్' పేరిట కొత్త విభాగం మొదలైంది. ఇక మీరంతా ఓ గ్రూప్ గా ఏర్పడి నాకు సలహాలు, సూచనలు పంపొచ్చు. ఇతరులతో మీ ఐడియాలను పంచుకుని చర్చించవచ్చు" అని మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. యాప్ అప్ డేట్ గురించి టిమ్ కుక్ వివరిస్తుంటే, తాను ఆసక్తిగా చూస్తున్న సమయంలో తీసిన ఫోటోను పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News