: త్యాగాలకు సిద్ధపడాల్సిందే, ఉద్యోగులంతా రావాల్సిందే: చంద్రబాబు
మరో నెల రోజుల్లోగా అమరావతిలో తాత్కాలిక సచివాలయం సిద్ధమైపోతుందని, ఉద్యోగులంతా ఈ ప్రాంతానికి రావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి స్పష్టం చేశారు. అన్ని శాఖల ఉద్యోగులు, కార్యాలయాలు ఒకే చోట ఉంటే పరిపాలన సులభమవుతుందని అభిప్రాయపడ్డ ఆయన, కొన్ని త్యాగాలు చేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉండాల్సిందేనని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ఉద్యోగుల్లో కొద్దిమంది మినహా మిగతావారంతా రావాల్సిందేనని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాను తాను అడగటం లేదని విపక్షాలు చేస్తున్న విమర్శలను చంద్రబాబు కొట్టిపారేశారు.