: మోదీ పాలనకు రెండేళ్లు ... ఒక సాంగ్ పోస్ట్ చేసిన ప్రధాని


ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు నేటితో రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా హ్యాష్ ట్యాగ్ తో ఒక పాటను మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన రెండేళ్ల పాలనలో జరిగిన దేశాభివృద్ధి గురించి ఈ పాటలో ప్రస్తావించారు. ఈ పాట ప్రస్తుతం సౌండ్ క్లౌడ్ ఆడియో ఫార్మాట్ లో లభ్యమవుతోంది. మోదీ పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమాల్లో ‘మేరా దేశ్ బదల్ రహా హై, ఆగే బాద్ రహా హై’ అనే థీమ్ తో సాగే ఈ సాంగ్ సాగుతుంది. కాగా, ప్రధానిగా మే 19, 2014న మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మర్నాడు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News