: వచ్చే నెల 7న మోదీ, ఒబామాల భేటీ
వచ్చే నెల 7వ తేదీన భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా భేటీ కానున్నారు. ఇరు దేశాల ప్రధానులు వైట్ హాస్ లో సమావేశం కానున్న విషయాన్ని శ్వేతసౌధం అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఆర్థికవృద్ధి, వాతావరణ మార్పులు, క్లీన్ ఎనర్జీ, భద్రత, రక్షణ సహకారం వంటి మొదలైన అంశాలపై ఇద్దరు ప్రధానులు చర్చించనున్నట్లు సమాచారం.