: నా పుట్టినరోజు బహుమతి ఎంతో ప్రత్యేకం: జూనియర్ ఎన్టీఆర్


యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా ఎంతో ప్రత్యేకమైన బహుమతిని అందుకున్నారు. ఇంతకీ ఆ బహుమతి ఇచ్చిందెవరనుకుంటున్నారు!... ‘నాన్నకు ప్రేమతో’ చిత్ర దర్శకుడు సుకుమార్. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ‘నా పుట్టినరోజుకు ఇంతవరకూ ఇటువంటి ప్రత్యేకమైన కానుకను నేనెన్నడూ పొందలేదు. థ్యాంక్స్ సుకుమార్ గారు’ అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. సుకుమార్ ఇచ్చిన బర్త్ డే కానుక ఫొటోను కూడా జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేశాడు. కాగా, 'నాన్నకు ప్రేమతో' చిత్రంలోని నేపథ్యాన్ని తీసుకుని గడియారం తయారు చేశారు. గడియారంపైన ‘టూ డాడ్ విత్ లవ్’ అని, గడియారం మధ్యలో ‘ఫాలో ఫాలో టైమ్’ అని, గడియారం కింద ‘గేమ్ ఓవర్’ అని రాసి రెండు బంతులను ఉంచారు.

  • Loading...

More Telugu News