: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్...ఢిల్లీ జనారణ్యంలో పూటుగా తాగి బాలికను ఢీ కొట్టాడు!


సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం హల్ చల్ చేస్తున్న ఓ వీడియోను చూస్తే ఒళ్లు గుగుర్పొడుస్తుంది. ఈ వీడియోను వీక్షించిన వారంతా కారు ఢీ కొట్టిన బాలిక చనిపోయిందనే భావిస్తారు. అదృష్టవశాత్తు బాలిక ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది. ఢిల్లీ మధు విహార్‌ లో రద్దీగా ఉన్న రోడ్లో అంతా మామూలుగా ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ఓ తాగుబోతు కారును అడ్డదిడ్డంగా నడుపుతూ రోడ్డు చివరన నడుస్తున్న బాలికను ఢీ కొట్టాడు. దీనిని చూసిన వారంతా ఆందోళనతో బాధిత బాలికకు ఏమైందా? అని వెళ్లి చూస్తే, దర్జాగా కారు దిగిన తాగుబోతు బాలికకు ఏమీ కాలేదని చెప్పి వెళ్లిపోయాడు. అయితే దీనిపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్యూషన్ నుంచి ఇంటికి వస్తుండగా తనను కారు ఢీకొట్టిందని, దీంతో తాను కారు ముందు భాగంపై పడిపోయానని, అదృష్టవశాత్తు ఏమీ కాలేదని ఆ బాలిక తెలిపింది. కారును నడిపిన వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడని చెప్పింది. ఈ వీడియో చూసిన వారంతా ఆ తాగుబోతును శిక్షించేవరకు దీనిని షేర్ చేయాలని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News