: ఐఫోన్ ప్రేమికులను ఆకట్టుకునే దిశగా ‘యాపిల్’ స్టోర్లు!
ఐఫోన్ ప్రేమికులను ఆకట్టుకునే దిశగా యాపిల్ సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. యాపిల్ స్టోర్లకు కొత్త లుక్ ను తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని స్టోర్ ను రీ-డిజైన్ చేసింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. రేపటి నుంచి కొత్త లుక్ లో యాపిల్ స్టోర్ ను చూడవచ్చని చెప్పారు. ఇంతకీ, న్యూలుక్ ఎలా తెచ్చారంటే... మొత్తం గాజు, మెటల్, చెక్కను ఉపయోగించి తయారు చేసిన ఒక ప్రొడక్ట్ ను ఈ రీ డిజైన్ కోసం వినియోగించారు. తద్వారా యాపిల్ స్టోర్ ను అందంగా తీర్చిదిద్దారు. భవిష్యత్తులో కొత్తగా ప్రారంభించబోయే ‘యాపిల్’ స్టోర్లు ఇదే రీతిలో ఉండనున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.