: జనావాసాల్లోకొచ్చిన అడవిపంది పట్టివేత
జనావాసాల్లోకి వచ్చిన అడవి పందిని ఫారెస్ట్ అధికారులు పట్టివేసిన సంఘటన హైదరాబాద్ వనస్థలిపురంలో ఈరోజు జరిగింది. అక్కడి ఎల్ఐజీ పార్కులో సంచరిస్తున్న అడవిపందిని గమనించిన స్థానికులు దానిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బెదిరిపోయిన అడవిపంది నలుగురు స్థానికులను గాయపరిచింది. ఈ సమాచారాన్ని అటవీశాఖాధికారులకు తెలియజేయడంతో వారు అక్కడికి చేరుకుని అడవిపందిని పట్టుకోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.