: ‘రోను’ఎఫెక్ట్!... విశాఖలో నిలిచిన స్వరాజ్ దీప్ నౌక, 1,218 మంది ప్రయాణికుల పడిగాపులు
కోస్తాంధ్రను కమ్మేసిన ‘రోను’ తుపాను కారణంగా ఉత్తరాంధ్రతో పాటు సెంట్రల్ ఆంధ్రా ప్రాంతాల్లో జన జీవనం స్తంభించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జనం ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇక ‘రోను’ ఎంట్రీ ఇవ్వకముందే విశాఖ నుంచి అండమాన్ బయలుదేరి వెళ్లాల్సిన ప్రయాణికుల నౌక స్వరాజ్ దీప్ నీటిలోనే నిలిచిపోయింది. అప్పటికే నౌక ఎక్కేసిన 1,218 మంది ప్రయాణికులు ఇటు నౌక దిగలేక, అటు ముందుకు సాగలేక నౌకలోనే చిక్కుకుపోయారు. దీనిపై సమాచారం అందుకున్న ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నౌకలోని ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.