: ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బ్రహ్మోత్సవం’... థియేటర్ల వద్ద సందడే సందడి!


టాలీవుడ్ యువ హీరో ప్రిన్స్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’ నేటి ఉదయం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు ప్రజలు అధికంగా ఉన్న అమెరికా సహా పలు దేశాల్లోనూ ఈ చిత్ర ప్రదర్శన ప్రారంభమైంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా భారీ ప్రచారం నేపథ్యంలో మహేశ్ బాబు అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైన ప్రతి థియేటర్ వద్ద అభిమానుల సందడి నెలకొంది. హైదరాబాదు సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ‘బ్రహ్మోత్సవం’ సందడి స్పష్టంగా కనిపిస్తోంది. తొలి షోలతోనే పాజిటివ్ టాక్ వచ్చిన ఈ చిత్రానికి ఓవర్సీస్ లో ఇప్పటికే రూ.1 కోటి మేర వసూళ్లు నమోదైనట్లు చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. చిత్రం విడుదలైన సందర్భంగా తొలి రోజు బ్లాక్ టికెట్లకు చెక్ పెట్టేందుకు ఐదు షోలకు తెలంగాణ సర్కారు అనుమతినిచ్చింది.

  • Loading...

More Telugu News