: ఎస్ బీహెచ్ సహా ఎస్ బీఐ అనుబంధ బ్యాంకుల్లో నేడు సమ్మె


ఎస్ బీఐ లో దాని అనుబంధ బ్యాంకులు అన్నింటినీ విలీనం చేసుకోవాలన్న ప్రతిపాదన మరోసారి తెరపైకి రావడంతో దాన్ని వ్యతిరేకిస్తూ అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం దేశవ్యాప్తంగా ఒక రోజు సమ్మె తలపెట్టారు. దీంతో ఆయా బ్యాంకు శాఖల్లో నేడు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఈ విషయమై బ్యాంకులు ముందుగానే కస్టమర్లను అప్రమత్తం చేశాయి. 20న ఉద్యోగ సంఘాలు సమ్మె తలపెట్టాయని, ముఖ్యమైన లావాదేవీలు ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంకులు ప్రకటనల రూపంలో సూచించాయి. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూరు, స్టేట్ బ్యాంకు ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్ కోర్, భారత్ మహిళా బ్యాంకు అనుబంధ బ్యాంకులుగా ఉన్నాయి. వీటిని తక్షణమే విలీనం చేసుకునేందుకు అనుమతించాలని ఎస్ బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య తాజాగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనను మొదటి నుంచి ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఒక రోజు సమ్మె నిర్వహిస్తున్నాయి.

  • Loading...

More Telugu News