: అన్నా డీఎంకే, డీఎంకే కూటమి మధ్య ఓట్ల తేడా 1.5 శాతం మాత్రమే!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే కూటమిల మధ్య పోరు హోరాహోరీగానే సాగింది. విపక్ష డీఎంకే కూటమిపై స్వల్ప తేడాతో అధిక ఓట్లు సాధించిన అన్నాడీఎంకే తిరిగి తన అధికారాన్ని నిలుపుకుంది. సీట్ల సంఖ్యలో ఈ రెండు పార్టీల మధ్య భారీ తేడా ఉన్నా... ఆ పార్టీలకు పోలైన ఓట్ల శాతంలో తేడా మాత్రం కేవలం 1.5 శాతమే. ఆయా పార్టీలకు లభించిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే... అన్నాడీఎంకేకు 40.8 శాతం ఓట్లు వచ్చాయి. అదే సమయంలో డీఎంకే కూటమికి 39.3 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే ఈ రెండు పార్టీల మధ్య తేడా కేవలం 1.5 శాతం ఓట్లేనన్నమాట. డీఎంకే కూటమికి వచ్చిన ఓట్లలో డీఎంకేకు 31.6 శాతం, కాంగ్రెస్ కు 6.5 శాతం, ఐయూఎంఎల్ కు 0.7 శాతం, పుదియ తమిళగం పార్టీకి 0.5 శాతం ఓట్లు వచ్చాయి.