: బెజవాడలో ఎడతెరిపి లేని వర్షం!... తాత్కాలికంగా మూతపడ్డ దుర్గ గుడి ఘాట్ రోడ్డు!
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం నేపథ్యంలో ఏపీకి ‘రోను’ తుపాను ముప్పు పొంచే ఉంది. వాయుగుండం తన దిశను ఒడిశా వైపు మార్చుకున్నా ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తూనే వుంది. ప్రత్యేకించి ఏపీలోని ప్రధాన నగరం విజయవాడలో నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఫలితంగా నగర శివారులోని కనకదుర్గ ఆలయానికి దారి తీసే ఘాట్ రోడ్డును అధికారులు తాత్కాలికంగా మూసేశారు. వర్షం కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరగకూడదన్న భావనతోనే ఈ రోడ్డును అధికారులు మూసేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దుర్గ గుడికి వెళ్లేందుకు భక్తులకు ప్రత్యామ్నాయ కాలి బాటను అధికారులు సిద్ధం చేశారు.