: అమిత్ షా బృందం, కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: ప్రధాని మోదీ
ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎన్డీయే బలోపేతానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో విజయం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బృందం, కార్యకర్తలదేనని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామంటూ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కాగా, అసోం ఎన్నికల్లో మొత్తం 126 స్థానాల్లో బరిలోకి దిగిన బీజేపీ 86 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సందర్భంగా అసోం బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి సర్బానంద్ సోనోవాల్ కు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. అలాగే, కేరళలో బీజేపీ నిర్మాణం కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపిన విషయం తెలిసిందే.