: అసోంలో బీజేపీ గెలుపుకి కారణం చెప్పిన బీహార్ సీఎం...'అన్ని రాష్ట్రాల ఫలితాలు ఊహించినవే' అని వ్యాఖ్య
అసోంలో కమలం వికసించి తొలిసారిగా బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోనుండడం పట్ల బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. బీజేపీ అసోంలో గెలిచినా ఆ క్రెడిటంతా కాంగ్రెస్‌దే అని మీడియాతో అన్నారు. ‘గెలుపుతో బీజేపీ సంబరాలు చేసుకోవడానికి వేరే పెద్ద కారణం ఏమీ లేదు.. కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగడమే అసోంలో కమలం పార్టీకి విజయాన్ని తెచ్చిపెట్టిందంతే’ అని ఆయన వ్యాఖ్యానించారు. ముందుగా ఊహించిన విధంగానే అసోంతోపాటు అన్ని రాష్ట్రాల ఫలితాలు వచ్చాయని అన్నారు. ఎన్నికల ఫలితాలలో ప్రత్యేకత ఏమీ లేదన్నారు.