: అసోంలో కౌంటింగ్ పూర్తి... తుది ఫలితాలు
ఈశాన్య రాష్ట్రాల పరిధిలో తొలిసారిగా బీజేపీ ఓ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల కౌంటింగ్ పూర్తికాగా, బీజేపీకి మూడింట రెండు వంతుల మెజారిటీ లభించింది. మొత్తం 126 స్థానాలున్న రాష్ట్రంలో బీజేపీ 86 సీట్లలో విజయబావుటాను ఎగురవేసింది. కాంగ్రెస్ 25, ఏఐయూడీఎఫ్ 13, ఇతరులు ఒక్క స్థానంలో గెలువగా, మరొక్క చోట ఫలితం వెలువడాల్సి వుంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. దీంతో బీజేపీ గెలుపొందే సీట్ల సంఖ్య 87కు పెరుగుతుందని అంచనా. ఇక రాష్ట్రంలో బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన శర్వానంద్ సోనోవాల్ వచ్చే వారంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.