: మేం హ్యాపీగా ఉన్నాం: అమిత్ షా
ఈ ఎన్నికల ఫలితాలు తమకు మంచి సంతృప్తిని కలిగించాయని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్నికల్లో తమ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కేరళలో సీట్లను గెలుచుకోవడంలో విఫలమైనా, తమకు పడ్డ ఓట్ల విషయంలో 200 శాతం విజయం సాధించామని తెలిపారు. 2011 ఎన్నికల్లో 5 శాతం ఓట్లకు పరిమితమైన తమ పార్టీ, ఈ ఎన్నికల్లో 15 శాతం ఓట్లను పొందిందని, ఎన్నో చోట్ల విజేతలకు గట్టిపోటీని ఇచ్చిందని వివరించారు. అసోం రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. గెలిచిన అభ్యర్థులకు అమిత్ షా అభినందనలు తెలిపారు.