: కాంగ్రెస్ వల్లే ఓటమి...ఆడిపోసుకుంటున్న మిత్రపక్షం


విజయం గర్వాన్ని తెచ్చినా తేకున్నా, అపజయం మాత్రం అసహనాన్ని కలిగిస్తుంది. ఆ అసహనం కోపంగా మారి తీవ్రవ్యాఖ్యల రూపంలో బయటకు వస్తుంది. అసోంలో ఓటమి చెందిన కాంగ్రెస్ మిత్రపక్షం ఏఐయూడీఎఫ్ ఆ పార్టీని ఇప్పుడు అలాగే ఆడిపోసుకుంటోంది. కాంగ్రెస్ తో పొత్తే తమ కొంప ముంచిందని ఆ పార్టీ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ మండిపడ్డారు. 15 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ పార్టీతో పొత్తే తమ కొంపముంచిందని ఆయన తెలిపారు. అసోం ప్రజల ఆదరణ చూరగొన్న బీజేపీకి ఆయన అభినందనలు తెలిపారు. కాగా, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News