: తుమ్మల రికార్డు సృష్టించారు... మాపై పెట్టుకున్న నమ్మకానికి ప్రజా తీర్పు ఇది: కేసీఆర్
పాలేరు ప్రజలు టీఆర్ఎస్కి అపూర్వమైన తీర్పునిచ్చారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ.. మొత్తం 17 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డిపై 45, 650 ఓట్ల తేడాతో విజయం సాధించారని, తమ అభ్యర్థి తుమ్మల ఎన్నడూ ఏ నాయకుడు పాలేరులో పొందలేనంత ఆధిక్యంతో సత్తాచాటారని ఆయన అన్నారు. ప్రజా తీర్పు మాపై బాధ్యతను పెంచిదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి పక్షాలు ప్రజాతీర్పును గుణపాఠంగా తీసుకొని ఇప్పటికైనా ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆపాలని ఆయన సూచించారు. ప్రజలు ప్రభుత్వం పట్ల చాలా స్పష్టంగా ఉన్నారని, మంచి ప్రభుత్వం అని కితాబిస్తున్నారని ఆయన అన్నారు.