: ప్రజా తీర్పును వినయంగా స్వాగతిస్తున్నాం: రాహుల్ గాంధీ


ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును వినయపూర్వకంగా స్వాగతిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన రాజకీయ పార్టీలన్నింటికీ అభినందనలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా కష్టపడి పనిచేసిన ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడితోపాటు భాగస్వామ్య పక్షాలకు ట్విట్టర్ లో ధన్యవాదాలు తెలియజేశారు. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తాను అధికారంలో ఉన్న అసోం, కేరళలో ఓటమి పాలైనట్టు ఎన్నికల ఫలితాల సరళితో స్పష్టమైన విషయం తెలిసిందే. మిగిలిన మూడింటిలో పుదుచ్చేరిలో మాత్రమే డీఎంకేతో కలసి అధికారం కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News