: తమిళ తంబీలు చూపిన 'కరుణ' సరిపోలేదు!


"నాకు చివరిసారిగా అవకాశం ఇవ్వండి. తమిళ ప్రజలకు మరింత సేవ చేయాలని ఉంది. రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తా..." అంటూ తమిళనాట సీఎంగా మరోసారి బాధ్యతలు స్వీకరించాలని 92 సంవత్సరాల వయసులో కరుణానిధి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తమిళ తంబీలు కరుణానిధిపై కాస్తంత కరుణ చూపినా, అది సీఎం పీఠానికి మాత్రం దగ్గర చేయలేకపోయింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 23 స్థానాలకు మాత్రమే పరిమితమైన డీఎంకే, ఇప్పుడు 90 స్థానాల వరకూ గెలుచుకునేలా కనిపిస్తున్నా, అధికారం మాత్రం వరుసగా రెండోసారి జయలలిత పక్షానే ఉండనుంది. ఇదే సమయంలో గత అసెంబ్లీలో 160 స్థానాలను దక్కించుకున్న జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే, ఇప్పుడు 140 సీట్లకు అటూఇటుగా గెలుచుకోనుంది. విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే 2011 ఎన్నికల్లో 29 స్థానాల్లో గెలవగా, ఇప్పుడా పార్టీ ఖాతాను కూడా తెరవలేదు. తాజా ఫలితాల సరళి ప్రకారం, అన్నాడీఎంకే నాలుగు స్థానాల్లో గెలిచి, 133 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, డీఎంకే 4 చోట్ల గెలిచి 90 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News