: మమతకు, జయలలితకు ప్రధాని మోదీ ఫోన్ లో అభినందనలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సరళిని బట్టి వరుసగా రెండోసారి తమ అధికార పీఠాలను నిలబెట్టుకోబోతున్న మహిళా ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీలతో మోదీ ఫోన్లో మాట్లాడారు. విజయకేతనం ఎగురవేస్తున్న జయలలితకు ఫోన్లో శుభాకాంక్షలు తెలియజేశానని మోదీ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అలాగే మమతకు కూడా కాల్ చేసి అద్భుత విజయంపై అభినందనలు తెలియజేసినట్టు మోదీ పేర్కొన్నారు. రెండోసారి పాలనా పగ్గాలు చేపడుతున్న ఆమెకు శుభాకాంక్షలు అందించినట్టు తెలిపారు. ‘మోదీజీ, థ్యాంకూ వెరీ మచ్ అంటూ’ మమతా బెనర్జీ కూడా ట్విట్టర్ వేదికగా ప్రతిస్పందించారు.