: ఆందోళన బాటలో హెచ్‌సీయూ విద్యార్థులు


హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివర్సిటీ విద్యార్థులు మ‌రోసారి ఆందోళ‌న బాట ప‌ట్టారు. విద్యాసంవ‌త్స‌రం ముగిసిన కార‌ణంగా ప్ర‌స్తుతం విద్యార్థులు హాస్ట‌ల్‌ను విడిచివెళ్లాలి. గ‌తంలో విద్యాసంవ‌త్స‌రం ముగిసినప్ప‌టికీ పోటీ ప‌రీక్షలు, ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌య్యే విద్యార్థుల‌కు హాస్ట‌ల్లో ఉండే అవ‌కాశం ఇచ్చేవారు. అయితే ఈసారి గ‌త సంప్ర‌దాయానికి విరుద్ధంగా వ‌ర్సిటీ అధికారులు అక్క‌డ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌వుతోన్న విద్యార్థులు హాస్ట‌ల్‌ని విడ‌వాల్సిందేన‌ని చెబుతున్నారు. అయితే అక్క‌డి 1500మంది విద్యార్థులు అధికారుల ఆదేశాల్ని వ్య‌తిరేకిస్తున్నారు. విద్యార్థుల్ని బలవంతంగా బయటకు పంపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. హాస్ట‌ల్ గ‌దుల‌కు తాళాలు వేశారు. దీంతో విద్యార్థులు ఆగ్రహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అధికారుల తీరు మారాల‌ని త‌మ డిమాండును నెర‌వేర్చాల‌ని విద్యార్థులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News