: సన్ టీవీ ఆనందం రెండు రోజులే... మళ్లీ 'బేర్'!


తమిళనాట డీఎంకే అధినేత కరుణానిధి కుటుంబసభ్యుల నేతృత్వంలో నడుస్తున్న సన్ టీవీ నెట్ వర్క్ నేటి స్టాక్ మార్కెట్ సెషన్లో కుదేలైంది. మూడు రోజుల క్రితం ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడైన వేళ, మంగళవారం నాటి సెషన్లో 10 శాతానికి పైగా పెరిగి 52 వారాల కనిష్ఠస్థాయిని తాకిన సన్ టీవీ ఈక్విటీ వాటా విలువ ఈ ఉదయం అంతే మొత్తం నష్టపోయింది. ఉదయం 11:20 గంటల సమయంలో సన్ టీవీ నెట్ వర్క్ వాటా విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 10.66 శాతం నష్టపోయి, రూ. 44.55 దిగజారి రూ. 381.90 వద్ద కొనసాగుతోంది. అధికారం జయలలిత పరమే కానుందని వెల్లడైన నేపథ్యంలో భారీ స్థాయిలో సన్ టీవీ వాటాలు అమ్మకానికి రావడమే ఇందుకు కారణం. దీంతో సన్ టీవీ వాటా విలువ పెరిగిన ఆనందం రెండు రోజుల్లోనే 'బేర్'మన్నట్లైంది.

  • Loading...

More Telugu News