: హోరాహోరీ పోరులో కరుణపై జయలలిత పైచేయి!
తమిళనాట జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే, కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ తలపడుతున్నాయి. మొత్తం 234 నియోజకవర్గాలుండగా ఇప్పటి వరకూ 97 స్థానాల్లో ఫలితాల సరళి వెల్లడైంది. 52 స్థానాల్లో అన్నాడీఎంకే, 45 స్థానాల్లో డీఎంకే ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆధిక్యపు నియోజకవర్గాల నంబర్ గేమ్ అటూ ఇటూ ఊగుతోంది. జయలలిత పార్టీకి కొంత ఆధిక్యం కనిపిస్తున్నప్పటికీ, డీఎంకే పుంజుకునే అవకాశాలూ ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో తమిళనాడు ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.