: పాలేరు పోస్టల్ బ్యాలెట్ లో సగం తుమ్మలకే!... తొలి రౌండ్ లోనే భారీ మెజారిటీ సాధించిన వైనం


ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అందరి అంచనాలను నిజం చేస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజయం దిశగా దూసుకెళుతున్నారు. కొద్దిసేపటి క్రితం మొదలైన ఓట్ల లెక్కింపులో భాగంగా అధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించారు. మొత్తం 14 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలవగా వాటిలో ఏడు ఓట్లను తుమ్మల కైవసం చేసుకున్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి కూడా సత్తా చాటారు. 14 ఓట్లలో ఆమె కూడా 6 ఓట్లను దక్కించుకున్నారు. ఇక మిగిలిన మరో ఓటు చెల్లకుండా పోయింది. ఆ తర్వాత తొలి రౌండ్ (పోస్టల్ బ్యాలెట్ రౌండ్ ను పరిగణనలోకి తీసుకుంటే రెండో రౌండ్) ఓట్ల లెక్కింపులో తుమ్మల భారీ ఆధిక్యం సాధించారు. సుచరితారెడ్డి కంటే ఆయనకు 4,180 మేర అధికంగా ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ లో తుమ్మలకు 5,978 ఓట్లు రాగా, సుచరితారెడ్డికి కేవలం 1,798 ఓట్లు మాత్రమే వచ్చాయి.

  • Loading...

More Telugu News