: నైరుతి రుతుపవనాలు అండమాన్ వరకు వచ్చేశాయ్!


భారతదేశంలోని రైతులంతా ప్రతిఏటా ఆసక్తిగా ఎదురు చూసే నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. సాధారణంగా జూన్ మొదటి వారం తరువాత వచ్చే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే వచ్చేశాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి ఏప్రిల్ నెలల్లోనే ఎండల తీవ్రతను చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంచనాకంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. మరో వారం రోజుల్లో ఈ రుతుపవనాలు కేరళను తాకనున్నాయని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది అంచనాలకు మించిన వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News