: హైదరాబాద్ లో కంటే అమరావతిలోనే అద్దెలు తక్కువన్న జాయింట్ కలెక్టర్


హైదరాబాద్ లో కంటే నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనే అద్దెలు తక్కువని జాయింట్ కలెక్టర్ శ్రీధర్ అన్నారు. ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగులు వెలగపూడికి ఈరోజు వెళ్లారు. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అమరావతి ప్రాంత ప్రజలు చాలా మంచివారని, ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుందని అన్నారు. ‘టెంట్లలో, అద్దె సామాగ్రితో సీఆర్డీఏ ఉద్యోగులు పనిచేశారని, అటువంటి పరిస్థితి మీకు లేదు’ అని మహిళా ఉద్యోగులతో శ్రీధర్ చెప్పారు. ఇక్కడ ఇంటిఅద్దెలు ఎక్కువనే అపోహలను నమ్మవద్దన్నారు. వెలగపూడిలో పనిచేసే ఉద్యోగులకు పూర్తి రక్షణతో పాటు సౌకర్యాలు కల్పిస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News