: పద్నాలుగేళ్లు తప్పించుకుని తిరిగి, నేడు దొరికిపోయిన 'గోద్రా' ప్రధాన కుట్రదారు


గోద్రా రైలు దహనం కేసులో ప్రధాన సూత్రధారి, మాజీ మునిసిపల్ కౌన్సిలర్ ఫరూక్ భానా ఎట్టకేలకు చిక్కాడు. గడచిన 14 సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్న భానాను ఈ ఉదయం కలోల్ టోల్ నాకా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. 2002లో గోద్రా సమీపంలో సబర్మతీ ఎక్స్ ప్రెస్ రైలుపై దాడి చేసి నిప్పు పెట్టిన కేసులో భానా ప్రధాన నిందితుడు. రైలు దగ్ధం కావడంతో 60 మంది మరణించగా, ఆపై వెల్లువెత్తిన మత కల్లోలాల్లో దాదాపు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో స్పెషల్ కోర్టు 31 మందిని దోషులుగా తేల్చి వారిలో 11 మందికి మరణదండన, మిగిలిన వారికి యావజ్జీవ జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందానికి పట్టుబడిన భానాను ప్రశ్నించిన అనంతరం కోర్టు ముందు హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News